Kadapa: పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులకు అడ్డుకట్ట

Kadapa: మైదుకూరు నియోజకవర్గంలోని మాబూనగర్‌లో 'ఫ్రైడే-డ్రైడే' కార్యక్రమం. వైద్యాధికారి డాక్టర్ వికసిత ఆధ్వర్యంలో ఇంటింటికీ ఫీవర్, లార్వా సర్వే. వడదెబ్బ, డెంగ్యూపై ప్రజలకు అవగాహన.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 22 May 2026 7:25 PM IST
Kadapa
X

Kadapa: పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులకు అడ్డుకట్ట

Kadapa: దువ్వూరు మండలం చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మాబూనగర్ నందు ఫ్రైడే డ్రైడే కార్యక్రమం లో భాగంగా వైద్యాధికారి డాక్టర్ వికసిత ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఇంటింటి ఫీవర్ లార్వా సర్వే నిర్వహించడం మయినది. ఈ సందర్భంగా డాక్టర్ వికసిత మాట్లాడుతూ వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పులు వలన ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వేడి మరియు ఉక్కపోత వల్ల వడదెబ్బ,​ చర్మ సమస్యలు, ​ఆహారం త్వరగా పాడైపోయి​ ఫుడ్ పాయిజనింగ్ వస్తాయని, అకాల వర్షాల వల్ల ఇంటి చుట్టుపక్కల గుంతలు, పాత టైర్లు, కొబ్బరి చిప్పల్లో నీరు నిలిచిపోయి డెంగ్యూ, మలేరియా, చికెన్‌గున్యా వంటి వ్యాధులు ప్రబలుతాయని, వడదెబ్బ బారిన పడకుండా ఎప్పటికప్పుడు తగినన్ని నీళ్లు త్రాగాలని.

ఓ ఆర్ ఎస్ ద్రావణం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీరు తీసుకోవడం చాలా మంచిదని.వర్షపు నీరు ఇంటి పరిసరాల్లో ఎక్కడా నిల్వ ఉండకుండా చూసుకోవాలని . ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేసి, మూతలు గట్టిగా పెట్టాలని,.ప్రతి శుక్రవారం​ డ్రై డే కార్యక్రమం పాటించాలని,నిద్రపోయేటప్పుడు తప్పనిసరిగా దోమ తెరలు వాడాలని,తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలని, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ప్రజలకు అవగాహన కల్పించడమైనది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి రాజగోపాల్, ఆరోగ్యపర్యవేక్షకుడు శివ గంగరాజు, ఆరోగ్య సహాయకారి జనార్దన్ రావు, సిహెచ్ఓ సౌభాగ్య లక్ష్మి, ఏఎన్ఎం అరుణ జ్యోతి, మరియు ఆశా కార్యకర్త శాంతమ్మ, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story