Rayachoti: పార్టీకోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు శ్రీకాంత్ రెడ్డి!
Rayachoti: రాయచోటిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డులను అందజేసిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, ప్రజల సమస్యలపై పనిచేయాలని సూచించారు.
Rayachoti: పార్టీకోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు శ్రీకాంత్ రెడ్డి!
Rayachoti: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వివిధ బాధ్యతలు చేపట్టిన ప్రతి నాయకుడు, కార్యకర్త పార్టీకి ఒక ప్రతినిధిగా ప్రజల్లోకి వెళ్లాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డులో వైఎస్సార్‌సీపీలో వివిధ హోదాలు పొందిన వారికి ఆయన పార్టీ గుర్తింపు కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా నూతన బాధ్యతలు స్వీకరించిన పార్టీ శ్రేణులను అభినందించారు. పార్టీ గుర్తింపు కార్డు ఒక అధికారిక గుర్తింపుగా మాత్రమే కాకుండా, పార్టీ అప్పగించిన బాధ్యతను ఎప్పటికప్పుడు గుర్తుచేసే సాధనంగా ఉండాలని పేర్కొన్నారు. పదవి పొందిన ప్రతి ఒక్కరూ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకగా నిలవాలని సూచించారు.
వార్డు స్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింత విస్తృతం చేస్తూ యువత, మహిళలు, వివిధ వర్గాల ప్రజలను పార్టీతో అనుసంధానం చేయాలని కోరారు. ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేస్తూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.గుర్తింపు కార్డు అందుకున్న ప్రతి ఒక్కరూ ఆ గుర్తింపుకు తగినట్టుగా బాధ్యతతో పనిచేస్తూ ప్రజలకు అండగా నిలవాలని శ్రీకాంత్‌రెడ్డి ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి మైనారిటీ జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, మాజీ స్కూల్ కమిటీ చైర్మన్ గౌస్ బాష,ముత్తువలీ బాష,సమీరుద్దీన్,ఆషం, ముహీర్,సుహెబ్, బాబ్జి,అబుజర్, ఉమర్,ఆర్షద్, ఆయాజ్, గోల్డ్ తాజ్,శర్మద్ తదితరులు పాల్గొన్నారు.




