Galiveedu: పసుపు కుంకుమ భూమిపై వివాదం: బాధితురాలి ఆవేదన
Galiveedu: గాలివీడు మండలం గోరన్‌చెరువులో వివాహంలో పసుపు కుంకుమ కింద ఇచ్చిన 2.40 ఎకరాల భూమిని తమ్ముడు కబ్జా చేస్తున్నాడని ప్రభావతమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
Galiveedu: పసుపు కుంకుమ భూమిపై వివాదం: బాధితురాలి ఆవేదన
అన్నమయ్య జిల్లా: గాలివీడు మండలం గోరన్ చెరువు గ్రామంలో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. సర్వే నంబర్ 2లోని రెండు ఎకరాల 40 సెంట్ల భూమి విషయంలో తన తమ్ముడు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని గాజుల ప్రభావతమ్మ ఆరోపించారు.
ఈ భూమిని వివాహ సమయంలో పసుపు కుంకుమ కింద ఇచ్చారని తెలిపారు. తన భూమిలోకి రావద్దంటూ అడ్డుకుంటూ దాడి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి తమ భూ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని ప్రభావతమ్మ వేడుకున్నారు.




