Galiveedu: 24 గంటల్లోనే మిస్సింగ్ కేసు ఛేదన – తల్లి, బిడ్డ సురక్షితం!

Galiveedu: గాలివీడులో అదృశ్యమైన ఈశ్వరమ్మ, కుమారుడు రంజిత్ వేంపల్లెలో సురక్షితంగా లభ్యం.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 23 July 2026 10:26 AM IST
Galiveedu
X

Galiveedu: 24 గంటల్లోనే మిస్సింగ్ కేసు ఛేదన – తల్లి, బిడ్డ సురక్షితం!

Galiveedu: గాలివీడు లోని నూలివీడు రోడ్డుకు చెందిన ఈశ్వరమ్మ (40), ఆమె కుమారుడు రంజిత్ కుమార్ రెడ్డి (2½) జూలై 14న అదృశ్యం కాగా, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గాలివీడు పోలీసులు 21 వ తేదీ మంగళవారం కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.

పోలీసుల ముమ్మర గాలింపు చర్యలతో కేసు నమోదైన 24 గంటలలోపే కడప జిల్లా వేంపల్లెలో స్థానికుల సమాచారంతో తల్లి, కుమారుడిని సురక్షితంగా గుర్తించి గాలివీడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం గాలివీడు ఎస్ఐ నరసింహారెడ్డి వారిని కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించనున్నారు. అదృశ్యమైన తల్లి, బిడ్డల ఆచూకీని సత్వరమే కనిపెట్టడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిన గాలివీడు ఎస్ఐ, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారు ప్రత్యేకంగా అభినందించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story