Galiveedu: ఆస్తి వివాదంలో న్యాయం చేయండి: గాలివీడు మహిళ ఆవేదన

Galiveedu: గాలివీడులో మామ చేసిన అప్పులు తీర్చినా ఇల్లు, దుకాణం లాక్కోవాలని అత్తమామలు వేధిస్తున్నారని బాధితురాలు కమలమ్మ జిల్లా యంత్రాంగాన్ని ఆశ్రయించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 4 Oct 2026 8:27 PM IST
Galiveedu
X

Galiveedu: ఆస్తి వివాదంలో న్యాయం చేయండి: గాలివీడు మహిళ ఆవేదన

Galiveedu: అన్నమయ్య జిల్లా గాలివీడుకు చెందిన కమలమ్మ ఆస్తి వివాదంలో తమకు న్యాయం చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ఆదివారం భర్త రామకృష్ణతో కలిసి మీడియాతో మాట్లాడుతూ, మామ చేసిన రూ.6.40 లక్షల అప్పును పెద్దమనుషుల సమక్షంలో చెల్లించినప్పటికీ, మళ్లీ అప్పుల పేరుతో తమ జీవనాధారమైన కిరాణా దుకాణం, ఇంటిని అప్పగించాలని వేధిస్తున్నారని ఆరోపించారు.

తన భర్త కువైట్‌లో సంపాదించిన డబ్బుతో అప్పులు తీర్చడంతో పాటు ఆస్తులు కొనుగోలు చేశామని తెలిపారు. భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారని, తమకు ఒక పాప ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతో తమకు నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. వాస్తవాలను సమగ్రంగా విచారించి, తమ కుటుంబానికి న్యాయం చేయాలని కమలమ్మ విజ్ఞప్తి చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI