Kadapa: అంజద్‌బాష అక్రమాలపై విచారణకు సిద్ధమా?: వెంకట నాథరెడ్డి

Kadapa: వైసీపీ హయాంలో అనేక అక్రమాలకు పాల్పడిన మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష తనపై చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని గంగిరెడ్డి వెంకట నాథరెడ్డి తెలిపారు.

G. RAVI KUMAR, KADAPA
Published on: 21 July 2026 5:11 PM IST
Kadapa
X

Kadapa: అంజద్‌బాష అక్రమాలపై విచారణకు సిద్ధమా?: వెంకట నాథరెడ్డి

కడప: తనహయాంలో అనేక అక్రమాలకు పాల్పడిన ప్రస్తుత మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాష తనపై చేసిన నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని గంగిరెడ్డి వెంకట నాథరెడ్డి తెలిపారు.ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ గత గ్రీవెన్‌సెల్‌లో తాను దేవాదాయశాఖకు చెందిన భూమిని కబ్జా చేశానని అంజద్‌బాష ఫిర్యాదు చేయడం వాస్తవ విరుద్దమన్నారు.

తన భూమికి సంబంధించి 1918 నుంచి అన్ని పత్రాలు ఉండగా, తాను కబ్జాకు పాల్పడ్డానని ఆరోపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంజద్‌బాష తన సహచరులు చెప్పిన అంశాలపై వాస్తవాలు తెలుసుకోకుండా ఇలా తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న అంజద్‌బాష సర్వే నెంబరు 384లో వంకపోరంబోకును ఆక్రమించుకుని 10 సెంట్లను భారీ భవంతి నిర్మించడమే కాకుండా కారు షోరూం వారికి అద్దెకు ఇచ్చి నెలకు రూ.10 లక్షలు పొందుతున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

చివరికి కార్పొరేషన్‌ అధికారులను సైతం బురిడీ కొట్టించి బ్యాంకు రుణాన్ని పొందిన విషయం వాస్తవమన్నారు. వైసీపీ హయాంలో ఎన్నో భూ కబ్జాలు, అక్రమాలకు పాల్పడిన అంజద్‌బాష వాటిపై విచారణ ఎదుర్కొనగలరా? అని ప్రశ్నించారు. చివరికి గత ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడపకు వచ్చినపుడు తనను చూసి ఓటు వేయాలని కోరారంటూ అంజద్‌బాష తీరు ఎలాంటిదో అందరికీ తెలుసన్నారు. నిరాధారణ ఆరోపణలు చేయడం తగదని, ఈ విషయంగా పోరాటం చేసేందుకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. తన భూమికి తగిన న్యాయం చేయాలని తాను కోరుతున్నానని వివరించారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA

Next Story