Vallelavaripalle: వల్లెలవారిపల్లెలో రూ.16 లక్షల నోట్లతో నరసింహునికి పూజలు

Vallelavaripalle: కడప జిల్లా గోపవరం మండలం వల్లెలవారిపల్లె లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భాద్రపద పౌర్ణమి సందర్భంగా రూ.16 లక్షల కొత్త నోట్లతో విశేష అలంకరణ చేశారు.

B. ARUN KUMAR, BADVEL
Published on: 26 Sept 2026 5:00 PM IST
Vallelavaripalle
X

Vallelavaripalle: వల్లెలవారిపల్లెలో రూ.16 లక్షల నోట్లతో నరసింహునికి పూజలు

కడప జిల్లా: బద్వేల్ డివిజన్ పరిధిలోని గోపవరం మండలం వల్లెలవారిపల్లె గ్రామంలో వెలసిన లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో శనివారం భాద్రపద పౌర్ణమిని పురస్కరించుకొని లక్ష్మీనరసింహస్వామికి వేకువజాము నుండి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు.

ఎంతో విశేషమైన ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష్మీ నరసింహ స్వామికి అన్ని ఆలయాల్లో ప్రత్యేకంగా అర్చనలు అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామిని 16 లక్షల రూపాయల కొత్త నోట్లతో స్వామివారిని విశేషంగా అలంకరించడం జరిగిందని ఆలయ ప్రధానాక్షకులు పెంచలయ్య స్వామి పేర్కొన్నారు.

అలాగే నరసింహ స్వామికి విష్ణుదేవులకు పౌర్ణమి అనేది ప్రీతికరంగా ఉంటుందని అందులో ఈ పౌర్ణమి శనివారం రావటం అశేష భక్త జనవాహికి ఆశీర్వాదకరమని తెలిపారు.భాద్రపద పౌర్ణమిని పురస్కరించుకొని ఎంతో విశేషమైన ఈ పర్వదినంలో లక్ష్మీనరసింహస్వామికి పూజలు, అర్చనలు,అభిషేకాలు నిర్వహిస్తే వారి కష్టాలు తొలగి వారి జీవితంలో సంతోషాలు వెల్లివిరుస్తాయని వారి పేర్కొన్నారు.

వేకువ జాము నుంచి చుట్టుపక్కల గ్రామాల నుండి వందలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగిందన్నారు.

ఇలా లక్ష్మీ రూపేనా స్వామివారిని అలంకరించటం దర్శించుకున్న ప్రజలకు రుణభారం తగ్గుతుందని, ఐశ్వర్యవంతులవుతారని, భక్తులు మనసులో అనుకున్న కోరికలు నెరవేర్చగల శక్తి ఈ పర్వదినాన నరసింహ స్వామికి ఉంటుందని ఇలాగు అన్ని నరసింహస్వామి ఆలయాలలో జరగటం విశేషమని ఆయన అన్నారు. అనంతరం ఆలయానికి పూజకు వచ్చిన భక్తులకు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL