Rayachoti: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం!

Rayachoti: రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు; వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని సత్తా చాటిన యువతీ యువకులు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 29 Aug 2026 12:57 PM IST
Rayachoti
X

Rayachoti: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం!

Rayachoti: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌.ఎస్‌.ఎస్‌, ఎన్‌.సీ.సీ మరియు క్రీడా విభాగాల ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు వివిధ క్రీడా పోటీలు నిర్వహించారు.

పురుష, మహిళా విద్యార్థులకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహించి క్రీడాస్ఫూర్తిని పెంపొందించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్‌ డా. ఎ. శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పోటీలను ప్రారంభించారు.

వాలీబాల్‌, క్రికెట్‌, మ్యూజికల్‌ చైర్స్‌, రింగ్‌బాల్‌ తదితర పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ డా. ఎ. శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమని, క్రీడలు క్రమశిక్షణ, జట్టుగా పనిచేసే నైపుణ్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని ఎన్‌.సీ.సీ కోఆర్డినేటర్‌ బి. కిరణ్‌కుమార్, ఎన్‌.ఎస్‌.ఎస్‌ కోఆర్డినేటర్లు యు. ప్రసాద్‌, ఖాజా వోయిస్‌ ఖిర్నీ, ఫిజికల్‌ డైరెక్టర్‌ జబ్బిఉల్లా సమన్వయంతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story