Kadapa; వైఎస్ జగన్‌పై ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి ధ్వజం!

Kadapa: వైఎస్ జగన్‌పై ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి తీవ్ర విమర్శలు: వివేకా హత్యకు తాడేపల్లి నుంచే డబ్బులు వెళ్లాయని ఆరోపణ. మద్యం కుంభకోణంలో అరెస్ట్ ఖాయమని వ్యాఖ్య.

G. RAVI KUMAR, KADAPA
Published on: 22 Sept 2026 11:45 PM IST
Kadapa
X

Kadapa; వైఎస్ జగన్‌పై ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి ధ్వజం!

కడప: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్‌ను నవయుగ కుబేరుడు గా అభివర్ణించిన ఆదినారాయణరెడ్డి వివేకానందరెడ్డి హత్య కేసులో తాడేపల్లి ప్యాలెస్ నుంచే డబ్బులు వెళ్లాయని ఆరోపించారు.కడప ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ఆదినారాయణరెడ్డి లిక్కర్ కేసులో అవినీతి సొమ్ము జగన్‌కు చేరిందని ఆరోపించారు.

అవినీతి డబ్బులకు ‘ఫ్రమ్, టు’ రెండూ జగన్‌నే అంటూ వ్యాఖ్యానించారు. ఆ డబ్బులే వివేకా హత్య కేసులో నిందితులకు చేరాయని ఆరోపించారు. జగన్ అరెస్టు తథ్యమని అన్నారు.నారా లోకేష్ రెడ్‌బుక్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యానించారు.

కూటమి ప్రభుత్వంలో లోపాలు దొరకకే జగన్ డీఎస్సీ అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో పులివెందులతో పాటు అన్ని చోట్ల వైఎస్సార్‌సీపీకి డిపాజిట్లు గల్లంతవుతాయని వ్యాఖ్యనించారు.గత 60 నెలలలో ఏం జరిగింది, ప్రస్తుత 28 నెలలలో పాలన ఎలా సాగిందని ప్రజలకు తెలియజేస్తామన్నారు.

గతంలో మాదిరిగా నామినేషన్ పత్రాలు చించడం, దౌర్జన్యాలకు పాల్పడటం తమ విధానం కాదని స్పష్టం చేశారు. నీతి, నిజాయితీతోనే ఎన్నికల్లో గెలుస్తామని ఆదినారాయణరెడ్డి వెల్లడించారు.96 లో పోటా పోటీ పరిస్థితులలో రాజశేఖర్ రెడ్డి నాటుకోడి తినడం మానేస్తానని ప్రమాణం చేసి గెలిచారని చెప్పుకుంటున్న జగన్ ఇప్పుడు ఏదైనా వదులుకొని గెలిచి చూపించు అని సవాల్ విసిరారు.

మారమని ఎన్నోసార్లు జగన్కు చెప్పడం జరిగిందని అతనిలో మార్పు రావడంలేదని పార్టీ వదిలి బయటకు వస్తే తనపై అనేక కేసులతోపాటు చంపడానికి కూడా ప్రయత్నించారని ఆరోపించారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA