Madanapalle: గణనాథునికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ సర్పంచ్ పసుపులేటి!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కురవంకలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 15 Sept 2026 7:58 PM IST
Madanapalle
X

Madanapalle: గణనాథునికి ప్రత్యేక పూజలు చేసిన మాజీ సర్పంచ్ పసుపులేటి!

మదనపల్లె: మండలంలోని కురవంక పంచాయతీలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరిగాయి.ఈ వేడుకలకు మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి,చార్టెడ్ అకౌంటెంట్ పసుపులేటి శశి కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.ముందుగా ఉత్సవ కమిటీ వీరికి ఘనస్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా పసుపులేటి చలపతి మాట్లాడుతూ కురవంకలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని ఉత్సవ కమిటీని అభినందించారు. భారతీయ సంస్కృతి,సంప్రదాయాలకు పర్వదినాలు నిదర్శనమన్నారు.

ప్రజలు ఆధ్యాత్మికత,భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. స్వామివారి కృపాకటాక్షాలతో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని,వ్యాపార రంగం అభివృద్ధి సాధించాలని తద్వారా ప్రతి ఇంట ఆనందం వెల్లివిరయాలని ఆకాంక్షించారు.అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle