Kadapa: వేంపల్లి కొత్త ఏఓకు బిజెపి సత్కారం!
Kadapa: కడప జిల్లా వేంపల్లిలో నూతన వ్యవసాయ అధికారి (AO) బాలగంగాధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ.
Kadapa: వేంపల్లి కొత్త ఏఓకు బిజెపి సత్కారం!
కడప: రైతు సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాల ధ్యేయమని, ఆ దిశగా రైతుల సంక్షేమానికి పాటుపడాలని కొత్తగా బాధ్యతలు చేపట్టిన వ్యవసాయ శాఖ అధికారి బాలగంగాధర్ రెడ్డిని, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి గాలి హరిప్రసాద్ కోరారు. శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టిన ఏఓ ని బిజెపి నాయకులు కలిసి శాలువ కప్పి ఘనంగా సత్కరించారు.
అనంతరం గాలి హరిప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు రైతులకు అందేలా కృషి చేయాలని, పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు.
సకాలంలో రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పుష్పలత, నాయకులు మునగల రాము, గండి దేవస్థానం సభ్యుడు గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




