Rayachoti: పాత రాయచోటిలో ఘనంగా హజరత్ జమాలుల్లా బాబా ఉరుసు ఉత్సవాలు!
Rayachoti: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని పాత రాయచోటి హజరత్ జమాలుల్లా బాబా ఉరుసు మహోత్సవాలు ఆగస్టు 25 నుంచి ప్రారంభం కానున్నాయి.
Rayachoti: పాత రాయచోటిలో ఘనంగా హజరత్ జమాలుల్లా బాబా ఉరుసు ఉత్సవాలు!
రాయచోటి: రాయచోటి పట్టణం పాత రాయచోటిలో వెలసి ఉన్న హజరత్ జమాలుల్లా బాబా ఉరుసు మహోత్సవాలు ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. 25వ తేదీ మంగళవారం గంధం ఊరేగింపుతో ఉరుసు మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
అదే విధంగా ఈ నెల 26వ తేదీ బుధవారం మధ్యాహ్నం దర్గా ఆవరణలో భారీ అన్నదాన కార్యక్రమం.. అదే రోజు సాయంత్రం ఉరుసు ఉత్సవం జరగనుంది. 27వ తేదీ శనివారం తహలీల్ ఫాతేహా కార్యక్రమంతో ఉరుసు ఉత్సవాలు ముగియనున్నాయి. ఉరుసు ఉత్సవాలకు హిందూ, మహమ్మదీయ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు.
Next Story




