Kadapa: కోట్ల భూమి కోసం 'బద్వేల్ టీడీపీ'లో గ్రూపు వార్

Kadapa: కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో భూమి కోసం టీడీపీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ.

B. ARUN KUMAR, BADVEL
Published on: 22 May 2026 7:36 PM IST
Kadapa
X

Kadapa: కోట్ల భూమి కోసం 'బద్వేల్ టీడీపీ'లో గ్రూపు వార్

Kadapa: కడప జిల్లా అట్లూరు క్రాస్ రోడ్డు వద్ద తెలుగుదేశం పార్టీ నాయకుల ఘర్షణలు. 1007/3 లో 37 సెంట్ల ప్రభుత్వ స్థలం పై బద్వేల్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రితీష్ కుమార్ రెడ్డి వర్గం కడప డిసిసి బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి వర్గం కన్ను.అదే స్థలంలో రెడ్డయ్య అనే వ్యక్తి భవన నిర్మాణం కోసం సామాగ్రిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ పరిస్థితుల్లో వెనుక ఉన్న పొలాలకు రోడ్డు వేసే సమయంలో అడ్డుగా ఉన్న భవన నిర్మాణం విషయంలో ఘర్షణ పడ్డ రెండు వర్గాలకు చెందిన టిడిపి నాయకులు.

ఘటనా స్థలానికి చేరుకున్న అట్లూరు రూరల్ ఎస్సై మరియు బద్వేల్ అర్బన్ సీఐ రామకృష్ణ ఘర్షణలు జరగకుండా అడ్డుకున్నారు. సర్వే నెంబర్లు 1013/3 తో పాటు 1007/3 సర్వేనెంబర్ భూములు కోర్టు పరిదిలో ఉన్నాయని ఈ భూములలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఎమ్మార్వో తెలియజేశారు. పోతిరెడ్డి నరసింహారెడ్డి అనే వ్యక్తికి పై సర్వే నెంబర్లలో డి పట్టాలు ఇచ్చారని సదరు ఢీ పట్టాలు అసైన్మెంట్ కమిటీ రెవెన్యూ రికార్డులలో ఉన్నాయని ఎమ్మార్వో తెలిపారు.

ఏది ఏమైనా ఈ సర్వే నెంబర్లు కోర్టు పరిధిలో ఉన్నందున ఎటువంటి నిర్మాణాలను చేపట్టరాదని ఇరు వర్గాలకు తెలియజేశారు.కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలం సొంతం చేసుకునేందుకు టిడిపిలో ఇరువర్గాలు ఎవరికి వారు దౌర్జన్యానికి దిగటం గత కొన్ని రోజులుగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవటం బద్వేల్ నియోజకవర్గం లో తరచూ చోటు చేసుకుంటున్నాయి.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story