Madanapalle: ఈ నెల 30న 'నీట్ పీజీ' పరీక్ష అన్నమయ్య జిల్లాలో భారీ బందోబస్తు

Madanapalle: అన్నమయ్య జిల్లాలో ఈ నెల 30న జరిగే నీట్-పీజీ పరీక్షకు భారీ బందోబస్తు. నిబంధనలు మీరితే కఠిన చర్యలు ఉంటాయని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరిక.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 29 Aug 2026 9:43 AM IST
Madanapalle
X

Madanapalle: ఈ నెల 30న 'నీట్ పీజీ' పరీక్ష అన్నమయ్య జిల్లాలో భారీ బందోబస్తు

Madanapalle: ఈ నెల 30న ఆదివారం అన్నమయ్య జిల్లాలో మదనపల్లె (మిట్స్, ఆదిత్య), రాయచోటి (శ్రీ సాయి, భాస్కర్) ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాల్లో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.30 వరకు నీట్ - పీజీ పరీక్ష జరుగుతుంది; ఉదయం 8.30 గంటల తర్వాత ఎవరినీ అనుమతించరు.

భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాల చుట్టూ 200-300 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుంది; ఆ పరిధిలోని జిరాక్స్ సెంటర్లు తప్పనిసరిగా మూసివేయాలి.

కేంద్రాల్లోకి మొబైల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా నిషేధం, పేపర్ లీక్ వదంతులు సృష్టించినా, అక్రమాలకు పాల్పడినా కఠిన క్రిమినల్ చర్యలు తప్పవని ఎస్పీ గారు హెచ్చరించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story