Kadapa: కడప కోటిరెడ్డి సర్కిల్‌లో హిజ్రాల హల్‌చల్.. ఇద్దరిపై దాడి

Kadapa: కడప కోటిరెడ్డి సర్కిల్ వద్ద ఇద్దరు వ్యక్తులపై హిజ్రాల దాడి. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఇరువర్గాల నిరసన. చర్యలు కోరుతున్న నగర ప్రజలు.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 30 Jun 2026 9:43 AM IST
Kadapa
X

Kadapa: కడప కోటిరెడ్డి సర్కిల్‌లో హిజ్రాల హల్‌చల్.. ఇద్దరిపై దాడి

కడప: నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఓ బార్ వద్ద హిజ్రాల హాల్ చల్.. మద్యం సేవించి బార్ కు ఇద్దరు వ్యక్తులతో వాగ్వివాదం. అనంతరం గుంపుగా వచ్చిన హిజ్రాలు ఇద్దరు వ్యక్తులపై అతి కిరాతకంగా దాడి.. అర్ధరాత్రి 1 టౌన్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్న బాధితులు.

తమకు న్యాయం చేయాలని రివర్స్ లో హిజ్రాల నిరసన.. కడప నడిబొడ్డున ఇంత జరిగినా ఇంతవరకు ఎటువంటి కేసు నమోదు చేయని వైనం.

ఇటీవల కాలంలో ఇళ్ల ప్రారంభోత్సవాలు, భవనాలు, దుకాణాల ప్రారంభోత్సవాల వద్దకు చేరుకుని హంగామా చేస్తున్న హిజ్రాలు.. అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే శాపాలు , పిడిగుద్దులు కురిపిస్తున్న వైనం.

నగర శివారు ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్ వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడి దౌర్జన్యానికి దిగుతున్న హిజ్రాలు. పోలీసులు, ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి హిజ్రాల నుండి సామాన్య ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా చూడాలని కోరుతున్న ప్రజలు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story