Duvvuru: దువ్వూరులో ఎరువుల దందా పక్క రాష్ట్రాల DAP అక్రమ విక్రయాలు!
Duvvuru: వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలంలో ఎరువుల వ్యాపారులు పొరుగు రాష్ట్రాల నుండి నాణ్యత లేని DAP దిగుమతి చేసుకుని, రైతులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
Duvvuru: దువ్వూరులో ఎరువుల దందా పక్క రాష్ట్రాల DAP అక్రమ విక్రయాలు!
Duvvuru: మండలంలో ఎరువుల వ్యాపారుల అక్రమాలు శృతిమించుతున్నాయి. వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడంతో డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు ఫర్టిలైజర్ షాపు యజమానులు అక్రమ మార్గాల్లో లాభాలు గడిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకల నుంచి నాణ్యత లేని, లైసెన్స్ లేని డిఏపి (DAP) ఎరువులను అనధికారికంగా దిగుమతి చేసుకుని స్థానిక రైతులకు విక్రయిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కొరత బూచిగా చూపి దోపిడీ
ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత ధరలకే ఎరువులు అమ్మాల్సి ఉండగా, మార్కెట్లో DAP కొరత ఉందనే నెపంతో షాపు యజమానులు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎం.ఆర్.పి (MRP) కంటే బస్తాపై రూ. 200 నుంచి రూ. 500 వరకు అదనంగా వసూలు చేస్తూ రైతుల జేబులకు చిల్లులు పొడుస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు తెచ్చిన స్టాక్‌ను ఇక్కడ అధిక ధరలకు అమ్ముతూ అక్రమ ఆర్జనకు పాల్పడుతున్నారు నాణ్యతపై రైతుల్లో ఆందోళన.
అనధికారికంగా దిగుమతి అవుతున్న ఈ ఎరువుల నాణ్యతపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ లేదా తక్కువ నాణ్యత గల ఎరువులను కొనుగోలు చేసి పంటల్లో వాడితే దిగుబడి దెబ్బతిని తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు కూడా ఇవ్వకుండానే కొందరు వ్యాపారులు విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం,కఠిన చర్యలు తీసుకోవాలి.
ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు, విజిలెన్స్ బృందాలు స్పందించి మండలంలోని ఫర్టిలైజర్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి ఎరువులను అక్రమంగా తెచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారుల లైసెన్సులను రద్దు చేసి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




