Badvel: బద్వేల్‌లో యోగా సందడి.. వందలాది మందితో విజయవంతంగా యోగా డే!
Badvel: బద్వేల్‌లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహణ.
Badvel: బద్వేల్‌లో యోగా సందడి.. వందలాది మందితో విజయవంతంగా యోగా డే!
కడప జిల్లా బద్వేల్: ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఆర్డీవో చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో డిసిసిబి బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి. అర్బన్ సీఐ బి.రామకృష్ణ, రూరల్ సీఐ కృష్ణయ్య, కమిషనర్ కృష్ణ పట్టణంలోని విద్యాసంస్థలు లోని విద్యార్థిని విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ఆయుష్ డిపార్ట్ మెంట్ వారి ఆద్వర్యంలో బద్వేల్ పట్టణంలోని మైదుకూరు రోడ్డు లో ఉదయం 6 :30 ఆహ్లాద వాతావరణములో యోగా గురువుగారిచే యోగా క్లాస్ నిర్వహించడం జరిగింది.
వివిధ యోగాసనాలు, ప్రాణాయామం, మొదలగు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమములో యోగా గురువులు, అమర్నాథ్ రెడ్డి ట్రైనీలు, డాక్టర్లు, ఉపాధ్యాయులు,ICDS సిబ్బంది, ఆశావర్కర్లు, మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది, పట్టణంలోగల సచివాలయముల సెక్రటరీలు, మెప్మా సిబ్బంది, నగర పంచాయితీ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి లో యోగ నిర్వహించడం వలన విశాలమైన రహదారిలో నిర్వహించటంతో విశేషంగా ఈ యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది.
చివరిగా ఆర్డీవో చంద్రమౌళి గారు కమిషనర్ కృష్ణ గారు మాట్లాడుతూ యోగా అనేది ఏదో తాత్కాలికంగా యోగాడే రోజున మాత్రమే కాకుండా మన దైనందిని జీవితంలో పాటించటం వలన ఆరోగ్యపరంగా మానసికపరంగా మానవ జీవన శైలిలో మార్పు ఉంటుందని తద్వారా మన ప్రస్తుత సమాజంలో ఆరోగ్య రుగ్మతల నుంచి దేహాన్ని కాపాడుకోగలమని ఆయన సూచించారు.




