Kadapa: కడపలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

Kadapa: ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ ఆదేశాలతో అక్కాయపల్లిలో దాడి.. రూ.7 లక్షల నగదు, ల్యాప్‌టాప్, గోవా మద్యం సీజ్.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 2 Jun 2026 11:44 AM IST
Kadapa
X

Kadapa: కడపలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

కడప: YSR కడప జిల్లా పోలీసు అధికారి (SP) శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాధ్, IPS గారి ఆదేశాల మేరకు, కడప SDPO శ్రీ E. బాలస్వామి రెడ్డి గారి పర్యవేక్షణలో, కడప తాలూకా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ P. నరసింహ రాజు గారి ఆధ్వర్యంలో, 31-05-2026 తేదీన రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో కడప నగరంలోని శాస్త్రి నగర్, అక్కాయపల్లిలో గల D.No.58/293-1-18-3, 1వ అంతస్తులో తనిఖీలు నిర్వహించగా, ఈ కేసులో ప్రధాన ముద్దాయి అయిన ఇందిరెడ్డి జనార్ధన్ రెడ్డి (A.1) తన నివాసంలో IPL–2026 RCB Vs GT ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

A.1 తన ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు మరియు Wi-Fi రూటర్ ద్వారా తన సబ్-బుకీలైన A.2 నుండి A.10 వరకు ఉన్న వారికి యూజర్ ఐడీలు మరియు URL లింకులు పంపించి, వాటి ద్వారా ప్రజల నుండి డబ్బును పందెంగా స్వీకరిస్తూ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు విచారణలో తేలింది. అదేవిధంగా, కస్టమర్లను ప్రోత్సహించేందుకు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా 12 మద్యం బాటిళ్లను అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా సమక్షంలో నిందితుడి వద్ద నుండి నగదు, ఎలక్ట్రానిక్ పరికరాలు, మద్యం బాటిళ్లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ముద్దాయిల వివరాలు:

1. ఇందిరెడ్డి జనార్ధన్ రెడ్డి (A.1), వయస్సు 30 సంవత్సరాలు, తండ్రి ఇందిరెడ్డి వెంకట రామిరెడ్డి, ప్రస్తుతం శాస్త్రి నగర్, అక్కాయపల్లి, కడప సిటీ.

2. మాధవరెడ్డి (A.2), మోడమీదపల్లి, కడప సిటీ.

3. నరేష్ (A.3), పులివెందుల టౌన్.

4. గోల్డ్ శేఖర్ (A.4), నరసరావుపేట, గుంటూరు జిల్లా.

5. గుగ్గిళ్ళ చాణక్య (A.5), చెన్నూరు.

6. రెడ్డయ్య రెడ్డి (A.6), చెన్నూరు.

7. హరినాథ్ @ శ్రీహరి (A.7), చెన్నూరు.

8. ఆమంచి కళ్యాణ్ చక్రవర్తి (A.8), చెన్నూరు.

9. షేక్ ఇంతియాజ్ (A.9), చెన్నూరు.

10. జయ ప్రకాష్ @ చంటి (A.10), చెన్నూరు.

11. ఇంకా మరికొంతమంది.

స్వాధీనం చేసుకున్న నగదు మరియు వస్తువులు:

(1) నగదు రూ. 7,00,550/-

(2) ఒక ల్యాప్‌టాప్,

(3) ఐదు మొబైల్ ఫోన్లు,

(4) ఒక Wi-Fi రూటర్,

(5) ఒక క్యాష్ కౌంటింగ్ మిషన్,

(6) 12 మద్యం ఫుల్ బాటిళ్లు (750 మి.లీ.) ( 6 NDPL (గోవా) బాటిళ్లు, 6 DPL బాటిళ్), (మద్యం బాటిల్ విలువ సుమారు ఒక లక్ష రూపాయలు)

అభినందనలు:

ఈ కేసులో నిందితులను గుర్తించి, ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ మరియు అక్రమ మద్యం నిల్వ వ్యవహారాన్ని వెలికితీసి, కీలక ఆధారాలతో పాటు నగదు మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోవడంలో విశేష కృషి చేసిన కడప తాలూకా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ P. నరసింహ రాజు, సబ్-ఇన్‌స్పెక్టర్ శ్రీ M. మహమ్మద్ రఫీ మరియు పోలీస్ సిబ్బందిని జిల్లా SP గారు మరియు కడప SDPO శ్రీ E. బాలస్వామి రెడ్డి గారు అభినందించారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story