Kadapa: పోటెత్తిన భక్తులు.. నారాపుర వెంకన్న రథం లాగేందుకు పోటీ!

Kadapa: కడప జిల్లా జమ్మలమడుగులో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం వైభవంగా జరిగింది.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU
Published on: 7 May 2026 1:20 PM IST
Kadapa
X

Kadapa: పోటెత్తిన భక్తులు.. నారాపుర వెంకన్న రథం లాగేందుకు పోటీ!

Kadapa: కడప జిల్లా జమ్మలమడుగులో శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. గురువారం రథోత్సవం వైభవంగా సాగింది. జిల్లా నలుమూలల నుంచి భక్తులు హాజరై రథం లాగేందుకు పోటీపడ్డారు.

జమ్మలమడుగు నారా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు గత నెల 30వ తేదిన ప్రారంభమై ఈనెల మే 10వ తేదీ వరకు జరగనున్నాయి. రథోత్సవం సందర్భంగా ఈ రోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు తేరు లాగే ప్రక్రియ ప్రారంభమైంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా టిడిపి అధ్యక్షులు భూపేష్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నారాపుర ఆలయం మీదుగా తేరు రోడ్డు, తాడిపత్రి రోడ్డు, పెద్ద పసుపుల మోటు, సంజామల మోటు, పాత బస్టాండ్ మీదుగా ఆంజనేయస్వామి దేవాలయం వద్దకు రథయాత్ర సాగింది. మెయిన్ బజారు మీదుగా నారాపుర ఆలయం ఆవరణానికి రథం చేరుకుంటుందని టిటిడి అధికారులు తెలిపారు.పట్టణంలోని పలువురు భక్తులకు చల్లని పానియాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU