Jammalamadugu: జమ్మలమడుగులో శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ అంశంపై జనసేన డిమాండ్!

Jammalamadugu: కడప జిల్లా జమ్మలమడుగులో శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ భూముల వ్యవహారంపై రైతులకు స్పష్టత ఇవ్వాలని జనసేన కోఆర్డినేటర్ నల్లంశెట్టి నాగార్జున డిమాండ్ చేశారు.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU
Published on: 4 Oct 2026 1:52 PM IST
Jammalamadugu
X

Jammalamadugu: జమ్మలమడుగులో శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ అంశంపై జనసేన డిమాండ్!

Jammalamadugu: కడప జిల్లా జమ్మలమడుగు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నియోజకవర్గం కోఆర్డినేటర్ నల్లంశెట్టి నాగార్జున మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్.ఉప్పలపాడు గ్రామంలో శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీకి భూముల విషయంపై ఫ్యాక్టరీ యాజమాన్యం, గ్రామ రైతుల మధ్య పలు దఫాలుగా సమావేశాలు జరిగినట్లు తెలిపారు. జనసేన పార్టీ, గ్రామ ప్రజల తరఫున సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డిలకు పలు అంశాలను విన్నవిస్తున్నామని చెప్పారు.

ఫ్యాక్టరీ కోసం భూములు కోల్పోయే ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు,గుత్త కట్టింపు తదితర అంశాలపై కూడా రైతులకు స్పష్టత ఇవ్వాలని కోరారు. ఫ్యాక్టరీ ఏర్పాటైన తర్వాత గ్రామ ప్రజల ఆరోగ్య భద్రతతో పాటు కాలుష్యం, డ్రైనేజీ, కాల్వల నిర్వహణ వంటి అంశాలపై యాజమాన్యం పూర్తి బాధ్యత తీసుకోవాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తారో స్పష్టంగా తెలియజేసిన తర్వాతే గ్రామ ప్రజలతో సమావేశమై మాట్లాడాలని సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి సూచించారు. రాయలసీమను రత్నాల సీమగా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.

రేపు సోమవారం ప్రొద్దుటూరు మండలానికి జల జీవన్ మిషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు తెలిపారు. తమ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి జిల్లా పర్యటన నేపథ్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU

D. CHINNI KRISHNA, JAMMALAMADUGU