Madanapalle: స్థానిక ఎన్నికల వేళ జనసేన బిగ్ ప్లాన్.. బాలినేనితో నేతల భేటీ!

Madanapalle: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన నేతల కీలక భేటీ. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆరని శ్రీనివాసులను కలిసిన మదనపల్లె జనసేన నాయకులు.

Srinivasulu, Madanapalle
Updated on: 10 May 2026 9:07 AM IST
Madanapalle
X

Madanapalle: స్థానిక ఎన్నికల వేళ జనసేన బిగ్ ప్లాన్.. బాలినేనితో నేతల భేటీ!

మదనపల్లె: ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చించేందుకు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, మదనపల్లె జనసేన నాయకులు తోట కళ్యాణ్ తదితరులు కమిటీ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, అహుడ చైర్మన్ టీసీ వరుణ్‌తో సమావేశమై రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లి మండల అధ్యక్షుడు సోలంకి ప్రదీప్ సింగ్, మదనపల్లె ఐటీ కో-ఆర్డినేటర్ కల్లూరు లక్ష్మీనారాయణ, తానేశ్వర్, ఫాజల్ ఖాన్, అజయ్ పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story