Kadapa: ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీపై ఏఐవైఎఫ్ ఆగ్రహం!

Kadapa: ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీపై ఏఐవైఎఫ్ (AIYF) ఆగ్రహం.

B. ARUN KUMAR, BADVEL
Published on: 19 Jun 2026 2:55 PM IST
Kadapa
X

Kadapa: ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీపై ఏఐవైఎఫ్ ఆగ్రహం!

Kadapa: ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల వివరాలు మండల విద్యాశాఖ అధికారుల దగ్గర లేవని చెప్పడం సిగ్గుచేటని అఖిల భారత యువజన సమాఖ్య కడప జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం బద్వేలు పట్టణం సిపిఐ కార్యాలయం జెవి భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అమలు చేస్తున్నటువంటి ఫీజుల వివరాలు మండల విద్యాశాఖ అధికారుల దగ్గర లేవని, మండల విద్యాశాఖ అధికారుల దగ్గర ఫీజుల వివరాల లేకపోవడంతో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యం విచ్చలవిడిగా విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రుల నుండి లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ, విద్యార్థుల తల్లిదండ్రుల పై అధిక భారం మోపుతున్నారని హాస్టల్ల పేరుతో ఎలాంటి అనుమతులు లేకపోయినా హాస్టల్ ఫీజుల పేరుతో కూడా వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల వివరాలు ఇవ్వండి అని జిల్లా విద్యాశాఖ అధికారిని అడగగా ప్రతి మండల విద్యాశాఖ అధికారి దగ్గర ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ప్రజలు వివరాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ విషయం పైన మండల విద్యాశాఖ అధికారులను ఫీజుల వివరాలు మాకు ఒక కాపీ ఇవ్వండి సార్ అని అడిగితే మా దగ్గర ఫీజులకు సంబంధించి ఎటువంటి వివరాలు లేవని ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ స్కూలు పైన మేము చర్యలు తీసుకోవడం జరుగుతుందని విద్యాశాఖ అధికారులు వివరణ ఇచ్చారని ఆయన అన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలు, షూస్, టైలు, బెల్టులు, ఐడీ కార్డులు తదితర వస్తువులను విద్యాసంస్థల ద్వారానే కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నాయి.

బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరలకు లభించే వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తూ వేలాది రూపాయల అదనపు భారం తల్లిదండ్రులపై మోపుతున్నారు. విద్యార్థుల విద్యాభ్యాసం పేరుతో జరుగుతున్న ఈ దోపిడీని అరికట్టడంలో విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ అనేక ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఆ మార్గదర్శకాలనుతుంగలోతోక్కి తమదైన శైలిలో విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు వ్యతిరేకంగా నడుస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షులు మునిరత్నం, సుధాకర్, రాజేష్ పాల్గొన్నారు,

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story