Kadapa: కడపలో అరుణాచలం తరహాలో అత్తిరాల అభివృద్ధి!

Kadapa: రాజంపేట అత్తిరాల క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు; శ్రావణ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణను ప్రారంభించారు.

G. RAVI KUMAR, KADAPA
Published on: 28 Aug 2026 7:18 AM IST
Kadapa
X

Kadapa: కడపలో అరుణాచలం తరహాలో అత్తిరాల అభివృద్ధి!

Kadapa: తల్లి ని హత్య చేసినా పరశురామునికి ఇక్కడ విముక్తి లభించిందట. Bhavna బహుదా నదిలో కర్మకాండలు చేయగా తల్లిని చంపిన పాపం నుంచి విభక్తి చెందాడట అదే కడప జిల్లాలోని రాజంపేట హత్యరాల త్రేతేశ్వర స్వామి పరశురాముని ఆలయాల విశిష్టత.

ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన అత్తిరాల మహాశైవ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది . ఈ క్రమంలోనే ఆలయ అభివృద్ధి, గిరి దారి నిర్మాణం జరిగింది.

శ్రావణ పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదర్శనను భక్తులతో కలిసి ప్రారంభించిన టీడీపీ ఇన్‌చార్జ్ చమర్తి జగన్‌మోహన్‌రాజు మీడియాతో మాట్లాడారు.ఎనిమిది వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన అత్తిరాల మహాశైవ క్షేత్రానికి పౌరాణికంగా ఎంతో ప్రత్యేకత ఉందని చమర్తి జగన్‌మోహన్‌రాజు తెలిపారు.

పరశురాముడికి సంబంధించిన పాపవిమోచన స్థలంగా అత్తిరాలకు విశిష్టత ఉందని చెప్పారు. సమీపంలోని విష్ణు ఆలయం దక్షిణ గయగా ప్రసిద్ధి చెందిందని, ఇక్కడ అపరకర్మలు నిర్వహిస్తే పుణ్యఫలం లభిస్తుందని పురాణాల్లో పేర్కొన్నట్లు తెలిపారు.కామాక్షి త్రయతేశ్వర స్వామి ఆలయం ఉన్న అత్తిరాలను మరింత అభివృద్ధి చేసి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

భక్తులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా యజ్ఞాలు, యాగాలు, హోమాలు, దోష నివారణ పూజలు నిర్వహించుకునేలా వసతులు కల్పిస్తామని తెలిపారు. మరుగుదొడ్లు, అపరకర్మ భవనం, నిత్య అన్నదానానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

అత్తిరాలకు వచ్చే భక్తుల కోసం మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. గిరిప్రదక్షిణకు అవసరమైన అభివృద్ధి పనులకు సుమారు రెండు కోట్ల రూపాయలు కేటాయించే ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు.

అరుణాచలం తరహాలో అత్తిరాలను అభివృద్ధి చేసి గిరిప్రదక్షిణ చేసే భక్తులకు వైద్య సదుపాయాలు, ఇతర మౌలిక వసతులు కల్పించాలన్నది ప్రభుత్వ ఆలోచనగా వెల్లడించారు. వేదపాఠశాల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సమగ్ర ప్రణాళికతో అత్తిరాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చమర్తి వెల్లడించారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA

Next Story