Kadapa: కడపలో బీజేపీ విలేకరుల సమావేశం - వైసీపీపై విమర్శలు

Kadapa: కడపలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి, బీసీల పట్ల వైసీపీ అనుసరించిన విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.

G. RAVI KUMAR, KADAPA
Published on: 31 Aug 2026 7:04 PM IST
Kadapa
X

Kadapa: కడపలో బీజేపీ విలేకరుల సమావేశం - వైసీపీపై విమర్శలు

కడప: రాష్ట్రంలో ప్రతిపక్ష వైసీపీ బీసీల విషయంగా చేస్తున్న మోసపూరిత మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి తెలిపారు.కడప నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్బరాయుడు మాట్లాడుతూ సంస్థల ఎన్నికల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతున్న సీట్ల విషయంగా కూటమి అగ్రనేతలు కూర్చొని చర్చించి సీట్ల విషయంగా అంగీకారానికి వస్తారన్నారు.

ఈ క్రమంలో జిల్లాతోపాటు రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. దేశం, సమాజం పట్ల అవగాహన కలిగి అన్ని విధాల అర్హులైన వారిని ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎంపిక చేస్తారన్నారు. బీసీలను ఏమాత్రం పట్టించుకోని నాటి వైఎస్సార్‌ ప్రభుత్వంతోపాటు గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారిని మభ్యపెట్టే చర్యలు కొనసాగించిందన్నారు.

బీసీ రిజర్వేషన్లకు సబంధించి ముస్లింలను కేటాయించి బీసీలోని ఇతర వర్గాలను వంచించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ అంశాన్ని బీసీ వర్గాలు గుర్తించుకోవాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన 34 శాతం సీట్లను బీసీలకు ఇచ్చేందుకు కూటమి ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు.

ఇప్పటికైనా బీసీలు, ఎస్సీలకు కేటాయించినసీట్లను ఆయా వర్గాలకే కేటాయిస్తారా? అని వైసీపీ నేతలకు సవాల్‌ చేస్తున్నామని తెలిపారు. తనకు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమించడం పార్టీ అగ్రనేతలు, నాయకులకు బొమ్మన సుబ్బరాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామినేని ప్రవీణ్,బొమ్మన విజయ్, బీజేవైఎం నాయకులు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA