Kadapa: కడప ఆర్టీసీ డిపో వద్ద సీఐటీయూ ధర్నా ప్రైవేటీకరణ ఆపాలి
Kadapa: ఆర్టీసీలో ప్రైవేటీకరణ ఆపాలని, విద్యుత్ బస్సులను సంస్థే సొంతంగా కొనుగోలు చేయాలని కడప డిపో ఎదుట సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకుల ధర్నా.
Kadapa: కడప ఆర్టీసీ డిపో వద్ద సీఐటీయూ ధర్నా ప్రైవేటీకరణ ఆపాలి
కడప: ఆర్టిసి లో ప్రైవేటీకరణ ఆపాలి విద్యుత్ బస్సులను ఆర్టీసీ సంస్థనే కొనుగోలు చేయాలని కడప ఆర్టీసీ డిపో ఎదుట సిఐటియు నాయకులు నిరసన ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు మాట్లాడుతూ 75 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆర్టీసీ సంస్థను పాలక ప్రభుత్వాలు తమ ప్రచార ఆర్భాటాల కోసం వాడుకుంటున్నాయని ఆరోపించారు.
కోట్ల రూపాయల స్థలాలు ఆస్తులు కలిగిన ఆర్టీసీని కారు చౌకగా లీజుల పేరిట కట్టబెట్టడం మానుకోవాలని హితవు పలికారు. విద్యుత్తు బస్సులు కొనుగోలుకు నిర్వహణకు కేంద్రం ఇచ్చే 60 శాతం రాష్ట్రం వాటా 40 శాతం ఆర్టీసీ సంస్థనే కొనుగోలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు.
కడప బస్టాండ్ 2.5 ఎకరాల భూమి కోట్ల రూపాయలు విలువ చేస్తున్న స్థలం అనంతపురం, కర్నూలు లలో బస్ డిపోలు నిర్మించి విద్యుత్ బస్సులు నిర్వహణ ప్రైవేటు సంస్థకు అప్పగించాలనే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
గత రెండు సంవత్సరాల కాలంలో ఒక కొత్త బస్సు కొనుగోలు చేయలేదని రిటైర్మెంట్ అవుతున్న వారి స్థానంలో కొత్తవారిని తీసుకోలేదని గుర్తు చేశారు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వ విలీనం చేసినారే తప్ప ఉద్యోగాలకు ప్రత్యేకంగా ఏమాత్రం ప్రయోజనం లేదన్నారు.




