Kadapa: కడపలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
Kadapa: కడప జిల్లాలోని 9 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ విశ్వనాథ్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
Kadapa: కడపలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
కడప: కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్, జిల్లా ఎస్పీ విశ్వనాథ్ తెలిపారు. కడప కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్తో పాటు భద్రతా ఏర్పాట్లను వివరించారు.
జిల్లాలో 8 మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్ కలిపి మొత్తం 9 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుందాని, ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ, 19న నామినేషన్ల పరిశీలన, 21న ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
28న పోలింగ్ నిర్వహించనుండగా.. అవసరమైతే 29న రీపోలింగ్ ఉంటుందని, 30న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం జరిగిందని తెలిపారు.
ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ విశ్వనాథ్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా, కార్డన్ అండ్ సెర్చ్, ఆకస్మిక తనిఖీలు, నాకాబందీలు కొనసాగుతాయని చెప్పారు.నామినేషన్, పోలింగ్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయడంతో పాటు మొబైల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, షాడో ఫోర్స్, పికెట్ ఫోర్స్లను అందుబాటులో ఉంచుతున్నారు.
పట్టణ ప్రాంతాల్లో ఎనిమిది కీలక ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు.సీసీటీవీ, పీటీజెడ్ కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగిస్తూ.. హైపర్ సెన్సిటివ్ కేంద్రాలపై ప్రత్యేక పర్యవేక్షణ చేపడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు సాయుధ బలగాలను మోహరిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
సోషల్ మీడియా పోస్టులపై నిగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు పోలీసులకు, అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.




