Kadapa: ఈ నెల 5న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన
Kadapa: ఈ నెల 5న కడప జిల్లా ప్రొద్దుటూరులో రూ.30 వేల కోట్లతో జల్ జీవన్ మిషన్ ప్రారంభించనున్నారు. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి.
Kadapa: ఈ నెల 5న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన
కడప: ఈ నెల 5వ తేదీన ప్రొద్దుటూరులో జరగనున్న జల్ జీవన్ మిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఎన్నికల హామీ మేరకు 'ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత మంచినీరు అందిస్తాం' అని ఇచ్చిన మాటను నెరవేరుస్తున్నామని తెలిపారు.
దాదాపు 30,000 కోట్ల రు భారీ వ్యయంతో రూపొందించిన ఈ ప్రాజెక్టును ఘనంగా ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. సభా ప్రాంగణం, ఇతర ఏర్పాట్లపై మంత్రి పరిశీలించి 10 నియోజకవర్గాల నుండి దాదాపు లక్ష మంది వరకు ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే 50% ఏర్పాట్లు పూర్తయ్యాయని, మిగిలిన పనులన్నీ రేపటికల్లా పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.




