Kadapa: పీజీఆర్ఎస్‌పై ప్రజల్లో నమ్మకం పెంచాలి: కలెక్టర్ శ్రీధర్
Kadapa: కడప కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్‌లో అర్జీలు స్వీకరించిన కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, సమస్యల పరిష్కారంలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు.
Kadapa: పీజీఆర్ఎస్‌పై ప్రజల్లో నమ్మకం పెంచాలి: కలెక్టర్ శ్రీధర్
పీజీఆర్ఎస్‌పై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి..!
* జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
* ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలి
కడప, ఆగస్టు 3: ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతతో పాటు ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని... "ఎల్‌నినో" వాతావరణ మార్పులు, ప్రత్యామ్నాయ చర్యలపై.. రైతులు, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సభాభవన్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.. జేసీ డా. నిధి మీనా తోకలిసి ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న తర్వాతే తగిన పరిష్కారం చూపాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పిజిఆర్ఎస్ వ్యవస్థపై అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తూ.. ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలన్నారు.
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్‌లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు.
ఎల్ నినో ప్రభావంపై ప్రజల్లో అవగాహన పెంచాలి..
ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ చర్యలు, ఈ ఖరీఫ్ సీజన్‌లో ప్రత్యామ్నాయ సాగు విధానాలపై జిల్లా ప్రజలు, రైతుల్లో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.




