Kadapa: భద్రతపై ఆందోళన ఉంటే 112కి కాల్ చేయండి: ఎస్పీ విశ్వనాథ్!
Kadapa: కడపలో స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోందని కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ విశ్వనాథ్ తెలిపారు. 3 పురపాలక సంఘాల్లో అదనపు అవకాశం ఇచ్చామన్నారు.
Kadapa: భద్రతపై ఆందోళన ఉంటే 112కి కాల్ చేయండి: ఎస్పీ విశ్వనాథ్!
Kadapa: కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని, మూడు పురపాలక సంస్థల్లో నామినేషన్ల దాఖలుకు ఎన్నికల కమిషన్ అదనపు అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎస్పీ విశ్వనాథ్ తెలిపారు.
కడప జడ్పీ కార్యాలయంలో జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం కలెక్టర్ శ్రీధర్ , ఎస్పీ విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ కడప నగరపాలక సంస్థలో 11, రాజంపేటలో 11, మైదుకూరులో 32 వార్డులకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
గతంలో నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలవుతున్నాయని... ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు.
అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో ఏర్పాట్లు చేశామన్నారు.నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ విశ్వనాథ్ తెలిపారు.
భద్రతపై ఆందోళన ఉన్న అభ్యర్థులు పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని, 112నంబర్‌కు ఫోన్ చేస్తే తక్షణమే స్పందిస్తామని స్పష్టం చేశారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగించేలా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్, ఎస్పీ తెలిపారు.
కడప : కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని, మూడు పురపాలక సంస్థల్లో నామినేషన్ల దాఖలుకు ఎన్నికల కమిషన్ అదనపు అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎస్పీ విశ్వనాథ్ తెలిపారు.
కడప జడ్పీ కార్యాలయంలో జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం కలెక్టర్ శ్రీధర్ , ఎస్పీ విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ కడప నగరపాలక సంస్థలో 11, రాజంపేటలో 11, మైదుకూరులో 32 వార్డులకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
గతంలో నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలవుతున్నాయని... ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు.
అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో ఏర్పాట్లు చేశామన్నారు.నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ విశ్వనాథ్ తెలిపారు. భద్రతపై ఆందోళన ఉన్న అభ్యర్థులు పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని, 112నంబర్‌కు ఫోన్ చేస్తే తక్షణమే స్పందిస్తామని స్పష్టం చేశారు.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియ కొనసాగించేలా అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్, ఎస్పీ తెలిపారు.కడప : కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని, మూడు పురపాలక సంస్థల్లో నామినేషన్ల దాఖలుకు ఎన్నికల కమిషన్ అదనపు అవకాశం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎస్పీ విశ్వనాథ్ తెలిపారు.
కడప జడ్పీ కార్యాలయంలో జెడ్పీటీసీ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం కలెక్టర్ శ్రీధర్ , ఎస్పీ విశ్వనాథ్ మీడియాతో మాట్లాడుతూ కడప నగరపాలక సంస్థలో 11, రాజంపేటలో 11, మైదుకూరులో 32 వార్డులకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. గతంలో నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలవుతున్నాయని... ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోందని తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ సమన్వయంతో ఏర్పాట్లు చేశామన్నారు.నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ విశ్వనాథ్ తెలిపారు.