Kadapa: కడప జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు 3,000 మంది పోలీసులతో బందోబస్తు!

Kadapa: కడప జిల్లా మున్సిపల్ ఎన్నికలకు 3,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు. ఆర్ట్స్ కళాశాలలో పంపిణీ కేంద్రాన్ని పరిశీలించి డీఐజీ కోయ ప్రవీణ్ తీవ్ర హెచ్చరికలు.

G. RAVI KUMAR, KADAPA
Published on: 31 Oct 2026 1:25 PM IST
Kadapa
X

Kadapa: కడప జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు 3,000 మంది పోలీసులతో బందోబస్తు!

Kadapa: కడప జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది పోలీసు బలగాలను మోహరించి.. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు.

కడప ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పరిశీలించారు. పోలింగ్ భద్రతపై పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ముఖ్యంగా కడప, పులివెందుల ప్రాంతాల్లో అదనపు బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

కడప నగరంలో 361 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఇందులో 16 అత్యంత సమస్యాత్మక, 42 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. కడప నగరంలోనే వెయ్యి మందికి పైగా పోలీసులతో బందోబస్తు చేపట్టారు.

ఇక పులివెందులలోనూ అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. పోలింగ్ రోజున ఓటు వేసేందుకు వైఎస్ జగన్‌కు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. అయితే ఓటు హక్కు వినియోగించుకున్న వెంటనే ఇంటికి వెళ్లాలని డీఐజీ స్పష్టం చేశారు.

ఎన్నికల సమయంలో అల్లర్లు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఐజీ కోయ ప్రవీణ్ హెచ్చరించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA