Badvel: కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం!
Badvel: బద్వేల్ ఆర్‌ఆర్ కన్వెన్షన్‌లో కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది.
Badvel: కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం!
బద్వేల్: బద్వేల్ పట్టణంలోని చెన్నంపల్లి సమీపంలో ఉన్న ఆర్‌ఆర్ కన్వెన్షన్‌లో ఆదివారం కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా వల్లంపండు వెంకటరమణ సెక్రటరీగా సివి నాగేశ్వరరావు ట్రెజరర్ గా పద్ధతి చంద్రశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా వెలిశెట్టి ప్రసాద్ మహిళ కమిటీ అధ్యక్షురాలుగా రాజా వెంకట వరలక్ష్మి ప్రధాన కార్యదర్శిగా కుంజేటి అరుణ కోశాధికారిగా దేవత లలిత యోజన సంఘం అధ్యక్షులుగా సన్నుతి హేమన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా దొంతు సతీష్ సెక్రటరీగా అయ్యప్ప మనోజ్ కోశాధికారిగా పైడిమర్రి సురేష్ బాబు వాసవి సేవా అధ్యక్షులుగా గాజులపల్లి హరి గోపాల్ సెక్రటరీగా రెడ్డి సురేష్ ట్రెజరర్ గా నాగ అభిరామ్ ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా మహాసభ అధ్యక్షులు నెల్లూరు లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శి మాటూరు రంగనాథ్ మహాసభ గౌరవ అధ్యక్షులు పెనుగొండ సుబ్బరాయుడు మహాసభ ఉపాధ్యక్షులు పబ్బిశెట్టి సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య, గౌరవ అధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు శ్రేష్టి, కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కూడా) చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు శ్రేష్టిలకు ఘన స్వాగతం లభించింది. ప్రముఖ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సొల్లేటి రమణ నేతృత్వంలో క్రేన్ సహాయంతో భారీ గజమాల వేసి అతిథులను సత్కరించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు వల్లంకొండు వెంకటరమణ, కమిటీ సభ్యులు ప్రత్యేక కోలాటాలు, భజంత్రీలు, వేద పండితుల పూర్ణకుంభ స్వాగతంతో శోభాయాత్రగా సభా ప్రాంగణానికి తీసుకెళ్లారు. జ్యోతి ప్రజ్వలన, అమ్మవారి ప్రార్థనతో వేడుకలు ప్రారంభమయ్యాయి.
కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా వల్లంకొండు వెంకటరమణ, వారి కార్యవర్గం చేత ఆర్యవైశ్య మహాసభ నాయకులు ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు రాజా వెంకట వరలక్ష్మి మరియు వారి కార్యవర్గంతో ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కే. రజిని, ప్రధాన కార్యదర్శి ఏ. సాయి నికిత, కోశాధికారి గంగా నాగ సుప్రజ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఐకమత్యంతోనే గుర్తింపు – టీజీ వెంకటేష్ పిలుపు అనంతరం జరిగిన సమావేశంలో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్యవైశ్యులంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఐక్యత ఉన్నప్పుడే సమాజంలోనూ, అన్ని రాజకీయ పార్టీల్లోనూ తగిన గౌరవం లభిస్తుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఆర్యవైశ్యులకు అవకాశాలు కల్పించాలని, వ్యాపార రంగంతో పాటు రాజకీయ రంగంలోనూ రాణించాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చే ఆర్యవైశ్యులకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ద్వారా పూర్తి అందిస్తామని హామీ ఇచ్చారు. క్షేమానికి, కష్టాల్లో ఉన్న వైశ్యులను ఆదుకోవడానికి తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు.
ఉత్తమ ప్రతిభ కనబరిచిన కడప జిల్లా మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య మాట్లాడుతూ, కడప జిల్లాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత ఘనంగా జరగడం అభినందనీయమన్నారు. సంఘం సభ్యత్వ నమోదులో కడప జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం వెనుక జిల్లా అధ్యక్షుడు వల్లంకొండు వెంకటరమణ కృషి ఎంతో ఉందన్నారు. విజయవాడలో నిర్మిస్తున్న ఆర్యవైశ్య భవన నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.
‘కూడా’ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నప్పటికీ సంఘం విషయానికి వచ్చేసరికి ఐకమత్యంగా ఉండాలని సూచించారు.
భారీగా తరలివచ్చిన బంధుమిత్తులు ఈ మహోత్సవంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాటూరు రంగనాద్, రాష్ట్ర మహాసభ ఐటీ అండ్ మెంబర్షిప్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ చక్క సూర్యప్రకాష్, బైలాస్ కమిటీ చైర్మన్ చెక్క చెన్నకేశవరావు,రాష్ట్ర కార్యదర్శి పేరూరు గాంధీ, కడప జిల్లా సంఘ గౌరవాధ్యక్షులు పి.వి.ఎన్. ప్రసాద్, కుప్పం వెంకట సుబ్బారావు, స్టేట్ సెక్రటరీ కొండపల్లి చిన్న సుబ్బారావు, స్టేట్ డైరెక్టర్ పరిటాల వెంకటసుబ్బయ్య, మాజీ టీటీడీ పాలక మండలి సభ్యులు చిప్పగిరి వెంకట ప్రసాద్, టంగుటూరి
మారుతి ప్రసాద్ మీడియా కమిటీ స్టేట్ వైస్ చైర్మన్ గోగుల శ్రీనివాసరావు, ఓబల శెట్టి రాధాకృష్ణ,కొణతాలపల్లి నరసింహులు, రామసుబ్బయ్య సొల్లేటి వెంకటరమణ మున్సిపల్ మాజీ వైఫ్ చైర్మన్ అడుగుతా సాయి కృష్ణ, మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కనుమరుల పుటీ ప్రసాద్, పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కమిటీలోని దాదాపు 700 మందికి పైగా పలువురికి శాలువాలు కప్పి ప్రమాణ స్వీకార పత్రాలు అందజేసి పెద్దల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేపించడం జరిగింది.అనంతరం ఏర్పాటుచేసిన ప్రత్యేక విందులో పలువురు పాల్గొన్నారు.




