Kadapa: గుడిపాడు హెల్త్ సెంటర్‌లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తనిఖీ: వ్యాక్సినేషన్ ప్రక్రియపై సిబ్బందికి కీలక ఆదేశాలు!
Kadapa: కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు హెల్త్ సెంటర్‌ను డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ వి. మల్లేష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Kadapa: గుడిపాడు హెల్త్ సెంటర్‌లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ తనిఖీ: వ్యాక్సినేషన్ ప్రక్రియపై సిబ్బందికి కీలక ఆదేశాలు!
దువ్వూరు (కడప జిల్లా): కడప జిల్లాదువ్వూరు మండల పరిధిలోని గుడిపాడు హెల్త్ సెంటర్‌లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను డిప్యూటీ డీఎంహెచ్‌ఓ (Dy.DM&HO) డాక్టర్ వి. మల్లేష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
వ్యాక్సిన్ వేసే సమయంలో లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. ఏ వ్యాక్సిన్ వేస్తున్నారు? అది ఏ వ్యాధి నివారణకు ఉపయోగపడుతుంది? అనే విషయాలను వివరించాలన్నారు. అలాగే, తదుపరి డోసు ఎప్పుడు, ఎక్కడ వేయించుకోవాలో ముందే వారికి స్పష్టంగా తెలియజేయాలని సిబ్బందిని ఆదేశించారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని, ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం లో ఆరోగ్య విస్తరణ అధికారి, పి. రాజగోపాల్, హెల్త్ సూపెర్వేజర్స్ మల్లేశ్వరమ్మా, శివ గంగా రాజు, డి. వెంకటేశ్వర్లు, Anm's మరియు ఆశలు పాల్గొన్నారు.




