Kadapa: కడప ఇంటి నిర్మాణ అనుమతులపై అధికారిపై ఆరోపణలు
Kadapa: కడపలో ఇంటి నిర్మాణం నిలిపివేతపై బాధితుల ఆవేదన. అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రపై అవినీతి ఆరోపణలు. కలెక్టర్, ఎస్పీలకు వినతిపత్రం సమర్పించిన కుటుంబ సభ్యులు.
Kadapa: కడప ఇంటి నిర్మాణ అనుమతులపై అధికారిపై ఆరోపణలు
కడప: కడప నగరానికి చెందిన ఎస్టి కులానికి చెందిన బుక్కే సామ్రాట్ నాయిక్ గత 45 ఏళ్లుగా అదే ఇంట్లో నివాసం ఉంటూ, 1990 నుంచి మున్సిపల్ ఇంటి పన్ను, విద్యుత్ బిల్లులు, నీటి పన్నులు చెల్లిస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు. 2023లో తమ పేరిట స్థలాన్ని రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నట్లు పేర్కొన్నారు.
ఇల్లు శిథిలావస్థకు చేరడంతో కొత్త ఇంటి నిర్మాణం కోసం కార్పొరేషన్ నుంచి ప్లాన్ అనుమతి తీసుకున్నప్పటికీ, నిర్మాణాన్ని అధికారులు నిలిపివేశారని ఆరోపించారు. ఈ స్థలంపై మరో వ్యక్తి కూడా హక్కు పత్రాలు సమర్పించారని చెబుతూ అడిషనల్ కమిషనర్ రాకేస్ చంద్ర కార్యాలయానికి పిలిచారని తెలిపారు. వారు సమర్పించిన పత్రాలలోని నకిలీ డి ఫామ్ అందులో 40 పదాలు తప్పుడుగా గుర్తించి ఎస్పీ కి జిల్లా రిజిస్టర్ కి తాసిల్దార్ కి కమిషనర్ కు ఫిర్యాదు చేశామన్నారు.
తమ వద్ద ఉన్న పత్రాలన్నీ సమర్పించినప్పటికీ నిర్మాణానికి అనుమతి ఇవ్వడం లేదని, ఈ వ్యవహారంలో అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర ఆపోజిట్ వారికి పది లక్షలు ఇస్తేనే లేదంటే మీ మీద క్రిమినల్ కేసు పెడతానని మమ్మల్ని ఇబ్బంధులకు గురించేస్తూ అనుచితంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అలాగే ప్రత్యర్థులు సమర్పించిన పత్రాల్లో అవకతవకలు ఉన్నాయని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వాపోయారు.కావున కార్పొరేషన్ అధికారులు, అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర ల పై చర్యలు తీసుకొవాలని
జిల్లా అధికారులను కోరారు. కలెక్టర్, ఎస్పీ, తహసీల్దార్, జిల్లా రిజిస్ట్రార్ తదితర అధికారులకు వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు. తమ ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి, ఇంటి నిర్మాణానికి అవకాశం కల్పించి న్యాయం చేయాలని కోరారు .




