Kadapa:కడప కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు, ఉద్యోగుల నిరసన

Kadapa: పీఆర్సీ కమిటీ ఏర్పాటు, పెండింగ్ డీఏల విడుదల కోసం కడపలో ఫ్యాప్టో నిరసన. కూటమి ప్రభుత్వంపై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల తీవ్ర అసహనం.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 14 July 2026 9:40 PM IST
Kadapa
X

Kadapa:కడప కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు, ఉద్యోగుల నిరసన

కడప: ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటుందని మీ సమస్యలన్నీ మా దృష్టిలో ఉన్నాయని పరిష్కరిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏమాత్రం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుందని ఫ్యాప్టో నాయకులు ఆరోపించారు.

తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు కడప కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం నాయకులు మాట్లాడుతూ పిఆర్సి కమిటీ ఏర్పాటుచేసి, మధ్యంతర భృతి పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు వెంటనే విడుదల చేయాలన్నారు.

ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత జగన్ ప్రభుత్వంలో రివర్స్ పిఆర్సి ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని,చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తూనే ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇస్తే నమ్మకంతో గెలిపిస్తే అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR

Next Story