Kadapa: కడపలో దారుణం.. పంచాయతీ సెక్రటరీ పై మాజీ వైసీపీ సర్పంచ్ దాడి!
Kadapa: కడప జిల్లా వీరబల్లి మండలం మట్లిలో దారుణం. నకిలీ బిల్లుల కోసం మాజీ సర్పంచ్ నాగార్జున ఆచారి పంచాయతీ సెక్రటరీ చంద్రుడిపై భౌతిక దాడి!
Kadapa: కడపలో దారుణం.. పంచాయతీ సెక్రటరీ పై మాజీ వైసీపీ సర్పంచ్ దాడి!
కడప జిల్లా: వీరబల్లి మండలం మట్లి గ్రామంలో పంచాయితీ సెక్రెటరీ చంద్రుడు పై టిడిపి మాజీ సర్పంచ్ నాగార్జున ఆచారి, అతని అనుచరులు రెచ్చిపోయి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో పంచాయితీ సెక్రెటరీ చంద్రుడు స్పృహ తప్పి కింద పడిపోయాడు. దీంతో మాజీ సర్పంచ్ అతని అనుచరులు అక్కడ నుంచి జారుకున్నారు. కాసేపు తర్వాత తేరుకున్న సెక్రెటరీ చంద్రుడు స్థానికుల సహాయంతో వీరబల్లి ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని ఎంపీడీవో జవహర్ బాబు కు తనపై జరిగిన దాడిని వివరించారు. అనంతరం తనపై మట్లి గ్రామ మాజీ సర్పంచ్ నాగార్జున ఆచారి, అతని అనుచరులు కలిసి అన్యాయంగా దౌర్జన్యం చేసి దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో అభివృద్ధి పనులు చేయకుండానే తమకు బిల్లులు చెల్లించాలంటూ తన ఒత్తిడి తెచ్చారని, నకిలీ బిల్లులు చేస్తే తన ఉద్యోగం పోతుందని చెప్పుకొచ్చినా కూడా తన పై రెచ్చిపోయి విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తాను ఇదివరకే గుండె సంబంధిత బాధపడుతూ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నానని చెప్పుకొచ్చారు. తనపై ఇలాంటి దాడులు చేయడం దారుణమని బాధిత పంచాయితీ సెక్రెటరీ చంద్రుడు వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి తనపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధిత పంచాయతీ సెక్రెటరీ చంద్రుడు వేడుకున్నారు.




