Kadapa: కడప ఆర్‌ఐఓ ఆఫీస్‌లో సందడి.. నూతన అధికారికి సిబ్బంది ఘన స్వాగతం
Kadapa: కడప ఇంటర్మీడియట్ రీజినల్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ (RIO)గా పి.ఎల్.ఎన్.ప్రకాశరావు పట్నాయక్ బాధ్యతలు స్వీకరించారు.
Kadapa: కడప ఆర్‌ఐఓ ఆఫీస్‌లో సందడి.. నూతన అధికారికి సిబ్బంది ఘన స్వాగతం
Kadapa: కడప ఇంటర్మీడియట్ రీజినల్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్‌గా పి.ఎల్.ఎన్.ప్రకాశరావు పట్నాయక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కడపలోని ఇంటర్మీడియట్ రీజినల్ కార్యాలయంలో ఆయనకు అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కడప జిల్లాతో పాటు పరిధిలోని అన్ని జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు నాణ్యమైన విద్య, పరీక్షల నిర్వహణ, ఫలితాల్లో మెరుగైన ప్రగతి సాధనకు చర్యలు తీసుకుంటామన్నారు.
అధ్యాపకులు కళాశాల యాజమాన్యాలతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ నిబంధనల అమలుకు కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో ఇంటర్ బోర్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




