Kadapa: ఖాజీపేటలో ఘోర విషాదం.. నీటి గుంతలో పడి అక్కాచెల్లెళ్లు మృతి!

Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలో ఘోర విషాదం జరిగింది.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 5 Jun 2026 6:36 PM IST
Kadapa
X

Kadapa: ఖాజీపేటలో ఘోర విషాదం.. నీటి గుంతలో పడి అక్కాచెల్లెళ్లు మృతి!

Kadapa: ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలో శుక్రవారం ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి వనం సంజన (18), వనం అర్చన (14) అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కుమార్తెలు దుర్మరణం చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

గ్రామానికి చెందిన వనం శివవాణి కుటుంబానికి పందుల పెంపకమే జీవనాధారం. ప్రతిరోజులాగే శుక్రవారం కూడా ఆమె తన కుమార్తెలు సంజన, అర్చన, మరియు కుమారులు గౌతమ్, కార్తీక్‌లతో కలిసి పందులను మేపేందుకు గ్రామ శివారుకు వెళ్లారు.

అక్కడ ఉన్న ఒక నీటి గుంత సమీపంలో పందులను మేపుతుండగా, అక్కాచెల్లెళ్లిద్దరూ ప్రమాదవశాత్తు ఆ నీటి గుంతలో పడిపోయారు. లోతు ఎక్కువగా ఉండటంతో వారు నీట మునిగిపోయారు.

ప్రమాదాన్ని గమనించి కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో, సమాచారం అందుకున్న గ్రామస్థులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, అప్పటికే ఇద్దరు బాలికలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.

రెక్కాడితే గాని డొక్కాడని పేద కుటుంబంలో, కళ్లముందే ఇద్దరు ఆడపిల్లలు మృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై స్థానిక పోలీసులు సమాచారం అందుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story