Kadapa: ఢిల్లీ ఆందోళనలు ఇండియా కూటమి కుట్రే: భాను ప్రకాష్

Kadapa: ఢిల్లీ నీట్ ఆందోళనలపై గ్రంథాలయ చైర్మన్ భాను ప్రకాష్ మండిపడ్డారు. ఇండియా కూటమి కుట్రతోనే లీకేజీ జరిగిందని విద్యార్థుల ముసుగులో అల్లర్లు చేస్తున్నారన్నారు

T. AMARNATH, PULIVENDULA
Published on: 23 July 2026 5:54 PM IST
Kadapa
X

Kadapa: ఢిల్లీ ఆందోళనలు ఇండియా కూటమి కుట్రే: భాను ప్రకాష్


కడప: డిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద లీకేజీ పై జరుగుతున్న నిరసన తీరు పై కడప జిల్లా గ్రంథాలయ చైర్మన్ భాను ప్రకాష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు

దిల్లీలోనీ జంతర్ మంతర్ వద్ద కొన్నీ రోజుల నుంచి హై డ్రామా జరుగుతోంది.

ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా దేశ గౌరవాన్ని నిలిపారన్న విషయం తెలిసిందే.

బీజేపీ ప్రతిష్ఠ దెబ్బ తీసేందుకు ప్రతి పక్ష పార్టీ ఇండియా కూటమి నీట్ పేపర్ లీకేజీ చేయించి , లీకేజీ నీ అడ్డుపెట్టు కొని తీవ్ర వాదులను రప్పించి దేశాన్ని అస్థిర పరిచే ప్రయత్నం చేస్తున్నారని కానీ వారి కుట్ర నెరవేరదు అని అన్నారు. .

విద్యార్థుల ముసుగులో పది కూడా చదవని యువకులతో నిరసన చేపట్టి అస్థిర పరిచే విధానాన్ని బీజేపీ అడ్డుకుంటుంది అన్నారు.

ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ లు ఒక్కసారి మీ పాలన గుర్తు చేసుకోండి , మీ పాలనలో కుంభకోణం తప్ప పాలన లేదు అన్నారు.

లీకేజీ విషయంలో ఎవరు తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అని మోదీ చెప్పారు అని స్వార్థంతో ఒకరు చేసిన తప్పును సమాజానికి ఆపాదించడం తగదు అన్నారు.

దేశాన్ని అస్థిర పరిచే ప్రతి అంశాన్ని ప్రతి ఒక్కరు అడ్డుకొని దేశాన్ని కాపాడుకుందాం అని మోదీ పిలుపునిచ్చారు అని తెలిపారు.

లీకేజీలు భవిష్యత్ లో జరగకుండా కట్టు దిట్ట మైన చర్యలు తీసుకుంటామని ప్రధాని స్పష్టం చేశారన్నారు.

విద్యార్థులు నిరసన చేసే సమయంలో కవరేజ్ చేయడానికి వెళ్లిన మహిళా జర్నలిస్ట్ పై అసభ్యకరంగా ప్రవర్తించారు అని అలా చేసే వ్యక్తులు విద్యార్థులా అని ప్రశ్నించారు. నిరసనలో వివిధ సంజ్ఞలు చేస్తూ మరో నేపాల్ అవుతుంది అని చెప్పడం చూస్తే కచ్చితంగా వారు విద్యార్థులు కాదు ఇండియా కూటమి చిల్లర మూఖలతో చేయించారు అని అర్థం అవుతుంది అన్నారు.

అధ్యక్షుడు నవీన్ కుమార్, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు లక్ష్మయ్య పాల్గొన్నారు.

T. AMARNATH, PULIVENDULA

T. AMARNATH, PULIVENDULA

Next Story