Kadapa: నగర అభివృద్ధి పనులపై కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్ మాధవి సమీక్ష!

Kadapa: కడప నగరంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి, టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 28 Aug 2026 10:51 PM IST
Kadapa
X

Kadapa: నగర అభివృద్ధి పనులపై కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్ మాధవి సమీక్ష!

కడప: నగరంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులతో కడప కలెక్టరేట్‌లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రభుత్వ విప్ & కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి, టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ శ్రీ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నగరంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్, అధికారులతో చర్చించారు. పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు వేగంగా స్పందించాలని, ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత శాఖల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story