Proddatur: ప్రొద్దుటూరుకు సెంట్రల్ యూనివర్సిటీ మంజూరు చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి

Proddatur: ప్రొద్దుటూరులో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కోరిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి. హైవే లింక్ రోడ్లపై విజ్ఞప్తి.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 26 Sept 2026 11:52 PM IST
Proddatur
X

Proddatur: ప్రొద్దుటూరుకు సెంట్రల్ యూనివర్సిటీ మంజూరు చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి

ప్రొద్దుటూరు: కడప జిల్లా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ముందుగా కడప విమానాశ్రయాన్ని సందర్శించారు. ఎయిర్‌పోర్టులో జరుగుతున్న పలు విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించేలా, కనెక్టివిటీని పెంచేలా చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అనంతరం, కేంద్ర మంత్రి యర్రగుంట్ల మండలం పొట్లదుర్తి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్వగ్రామానికి విచ్చెసిన ఆయన, పలువురు ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని కలసి, ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక పనులపై వినతిపత్రం అందజేశారు.

ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నత విద్యను అందించేందుకు వీలుగా ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ​ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని మిస్సింగ్ హైవే లింక్ రోడ్లను నేషనల్ హైవే పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ​

ఈ రోడ్డు పనుల పురోగతిపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ తో మాట్లాడి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలని కోరారు. నియోజకవర్గానికి అత్యంత అవసరమైన ఈ మౌలిక వసతుల పనులను కేంద్ర స్థాయిలో సమన్వయం చేసి, వీలైనంత త్వరగా పూర్తి చేయించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR