Kadapa: కడప రాయలసీమను 'రత్నాలసీమ'గా మారుస్తాం ఎమ్మెల్సీ
Kadapa: రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వెల్లడి. జగన్ హయాంలో మూతపడిన పరిశ్రమలను తిరిగి పునరుద్ధరిస్తున్నామని ప్రకటన.
Kadapa: కడప రాయలసీమను 'రత్నాలసీమ'గా మారుస్తాం ఎమ్మెల్సీ
కడప: రాళ్ల సీమగా ఉన్న రాయలసీమను రాతనాలసీమగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని టిడిపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు. కడప టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కేవలం జగన్ తిట్టేందుకే అధికారి పార్టీ నాయకులు కడపకు వస్తున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అక్కడించారు.
రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు అనేక సంస్థలను తీసుకురావడం జరిగిందని, వైసిపి గవర్నమెంట్ లో కాలుష్యం పేరుతో సిమెంట్ ఫ్యాక్టరీని మూసివేయాలని నోటీసులు ఇస్తే,ఈ కూటమి ప్రభుత్వంలో అదే సిమెంట్ ఫ్యాక్టరీలో రెండవ సిమెంట్ ప్లాంట్ కు భూమి పూజ చేయడం జరిగిందని తెలిపారు.
కాలుష్య రహిత గ్రీన్ సిమెంట్ ప్లాంటుకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. కడప జిల్లాలో అనేక సీనియర్ ఫ్యాక్టరీల తోపాటు భారతి సిమెంట్ కూడా ఉందని ఆ పరిశ్రమలలో లేని కాలుష్యం ఒక దాల్మియా సిమెంట్ లోనే ఎలా వస్తుందని ప్రశ్నించారు.




