Kadapa: బద్వేల్‌లో ప్రజల చేరువకు పాలన సదస్సు.. పాల్గొన్న జేసీ నిధి

Kadapa: కడప జిల్లా బద్వేల్‌లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజల చేరువకు పాలన" కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ నిధి మీనా ప్రారంభించారు.

B. ARUN KUMAR, BADVEL
Published on: 5 Jun 2026 3:30 PM IST
Kadapa
X

Kadapa: బద్వేల్‌లో ప్రజల చేరువకు పాలన సదస్సు.. పాల్గొన్న జేసీ నిధి

Kadapa: కడప జిల్లా బద్వేల్ నెల్లూరు రోడ్డులోని స్థానిక రాఘవేంద్ర కళ్యాణమండపంలో ఈ శుక్రవారం 5 వ తేదీన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన నెలకు నాలుగు క్షేత్ర పర్యటనలు కార్యక్రమంలో భాగంగా ప్రజల చేరువకు పాలన నినాదంతో జిల్లా కలెక్టర్ తో సహా అధికార యంత్రాంగం భాగస్వామ్యంతో భూ సమస్యలపై నాలుగు వారాలలో పరిష్కారము. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా బద్వేల్ పట్టణంలో నిర్వహించటం జరిగింది.

ఈ కార్యక్రమానికి కడప జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా బీసీసీ బ్యాంకు చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి, మైదుకూరు డిఎస్పి రాజేంద్రప్రసాద్, ఆర్డీవో చంద్రమౌళి, తో పాటు రెవెన్యూ యంత్రాంగం పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఓఆర్ సరిహద్దు వివాదాలు, దారి వివాదాలు, అన్నదమ్ముల మధ్య భూ తగాదాల పరిష్కారము, నామమాత్రపు ఖాతాల మార్పిడి వంటి అంశాలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి నాలుగు వారాలలో సత్వరం పరిష్కారం చేసే దిశగా కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు అధికారుల సమక్షంలో అర్జీలు సమర్పించడం జరిగింది.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL

Next Story