Kadapa: కడపలో పోలీసుల రూట్ మార్చ్.. ఎన్నికల వేళ గట్టి భద్రత!

Kadapa: కడపలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు. 144 సెక్షన్ అమలులో ఉందని, నిబంధనలు దాటితే చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు.

G. RAVI KUMAR, KADAPA
Published on: 16 Oct 2026 7:44 PM IST
Kadapa
X

Kadapa: కడపలో పోలీసుల రూట్ మార్చ్.. ఎన్నికల వేళ గట్టి భద్రత!

కడప: మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో కడప నగరంలో పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా ప్రజల్లో భద్రతా భావం కల్పించడమే లక్ష్యంగా పోలీసులు కవాతు చేపట్టారు.

కడప నగరంలోని మాసాపేట సర్కిల్ నుంచి అల్మాస్‌పేట సర్కిల్ వరకు పోలీసుల రూట్ మార్చ్ కొనసాగింది. కడప డీఎస్పీ భవాని నేతృత్వంలో జరిగిన ఈ రూట్ మార్చ్‌లో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని డీఎస్పీ భవాని తెలిపారు. ప్రస్తుతం 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఎవరూ అనవసరంగా గుమికూడవద్దని సూచించారు.

ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, వివాదాస్పద ప్రచారం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎన్నికల సమయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని డీఎస్పీ భవాని స్పష్టం చేశారు.

మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA