Kadapa: హోమ్ లోన్ల పేరుతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల దోపిడీ
Kadapa: కడప జిల్లాలో హోమ్ లోన్ల పేరుతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు పేద ప్రజలను నిలువునా దోచుకుంటున్నాయని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ ఆరోపించారు.
Kadapa: హోమ్ లోన్ల పేరుతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల దోపిడీ
Kadapa: బద్వేలు పోరుమామిళ్ల మైదుకూరు ప్రాంతాల్లో లాగిన్ ఫీజుల పేరుతో ఫైవ్ స్టార్, ఆఫ్టస్, అపాక్ మొదలగు హోమ్ లోన్ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు పేద ప్రజల నుండి వేల రూపాయల డబ్బును దోచుకుంటున్నారని అటువంటి కంపెనీలపై చర్యలు తీసుకొని సీజ్ చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ కడప జిల్లా అధ్యక్షులు పెద్దలపల్లె ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కడప జిల్లాలోని బద్వేలు, పోరుమామిళ్ల, మైదుకూరు మొదలగు ప్రాంతాల్లో ఫైవ్ స్టార్, అప్టాస్, అప్పాక్, హోమ్ లోన్ ఫైనాన్స్ కంపెనీలు పేద ప్రజలే టార్గెట్ గా హోమ్ లోన్ల పేరుతో లోన్లు ఇప్పిస్తామని ఆశ చెప్పి మేమే రిజిస్ట్రేషన్ చేపిస్తాం లోన్ ఇప్పిస్తాం.
దీనికి లాగిన్ ఫీజు కట్టాలి. అని ప్రజల నుండి వేల రూపాయలు లాగిన్ ఫీజు పేరుతో తీసుకొని వారిని తరచు ఫైనాన్స్ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ తిరిగి తిరిగి వేసారిన ప్రజలు ఇదేంటి మాకు లోనైనా ఇవ్వండి. లేదంటే మేము కట్టిన లాగిన్ అమౌంటు తిరిగి ఇవ్వమని అడిగితే ఆ డబ్బులు రాదు. మేము ఇవ్వము. మీ దిక్కున చోట చెప్పుకోండి అంటూ లోన్ కోసం వచ్చిన ప్రజలను దుర్భాషలాడుతూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
స్పందన, ఫిన్ కేర్, ఫెడరేల్, చోళ, టాటా కాపిటల్, ఎస్ బ్యాంకు మొదలగు ఫైనాన్స్ కంపెనీలు గ్రూపులో పేరుతో గ్రామాల్లో లోన్లు ఇచ్చి టైం కు కట్టకపోతే సామాన్లు బయట పడేస్తాం. మీ దిక్కున చోటు చెప్పుకోండి. అంటూ అనేక రకాలుగా ప్రజలను ఎక్కువగా ఆడవాళ్లను ఈ ఫైనాన్స్ కంపెనీల ఏజెంట్లు మరియు మేనేజర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికీ వారు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఫైనాన్స్ కంపెనీల ఒత్తిడిలకు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ఈ హోమ్ లోన్ ఫైనాన్స్ కంపెనీలు అందులో పనిచేసే సిబ్బందిని టార్గెట్ల పేరుతో వేధిస్తూ కార్యాలయ సమయం ముగిసిన కూడా రాత్రిపూట 11, 12 గంటల వరకు టార్గెట్లు పూర్తి చేసే వరకు వెళ్లేది లేదంటూ షరతులు విధిస్తూ వారిని వేధిస్తున్నారు. ఈ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు ప్రజలపై ఒత్తిడి చేయకుండా ప్రజల వెసులుబాటుతో లోను తిరిగి కట్టించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
హోమ్ లోన్స్ కంపెనీలు ప్రజల నుండి లాగిన్ ఫీజుల పేరుతో తీసుకున్న సొమ్మును వెంటనే తిరిగి ఇవ్వకపోతే ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల కార్యాలయాల ముందు ఆందోళనలు చేసి ప్రజలకు అండగా ఉంటామని ఆయన హెచ్చరించారు. సిబ్బందిపై ఒత్తిడిని కూడా తగ్గించి కార్యాలయ సమయంలోనే వారితో విధులు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.




