Proddatur: అండర్–17 క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన 14 ఏళ్ల కుర్రాడు

Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన 14 ఏళ్ల యువ క్రికెటర్ సాద్ ఇర్ఫాన్ వరుసగా మూడోసారి జాతీయ జట్టుకు అర్హత సాధించి అండర్–17 వైస్ కెప్టెన్‌గా ఎంపికవడంతో ఘన సన్మానం జరిగింది.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 28 Nov 2026 8:45 AM IST
Proddatur
X

Proddatur: అండర్–17 క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన 14 ఏళ్ల కుర్రాడు

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరుకు చెందిన సాద్ ఇర్ఫాన్ క్రికెట్‌లో తన ప్రతిభతో దూసుకుపోతున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే వరుసగా మూడోసారి జాతీయ స్థాయి జట్టుకు అర్హత సాధించి, ఇప్పుడు అండర్–17 జట్టు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ సేవా కేంద్రం ఆధ్వర్యంలో సాద్ ఇర్ఫాన్‌ను ఘనంగా సత్కరించారు. ​ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒలింపిక్ అసోసియేషన్ చైర్మెన్ ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి, యూత్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు మార్తల సుధాకర్ రెడ్డి సాద్ ఇర్ఫాన్‌ను అభినందించారు.

పట్టుదల, కృషి, క్రీడా నైపుణ్యంతో సాద్ ప్రొద్దుటూరుకు గర్వకారణంగా నిలిచాడని కొనియాడారు. ​కార్యక్రమంలో సాద్ ఇర్ఫాన్ తండ్రి ఇర్ఫాన్ బాషాతో పాటు కోచ్ అహ్మద్ భాషా, డాక్టర్ టి.డి. వరుణ్ కుమార్ రెడ్డి, వినోద్ మన్కడ్ ట్రోఫీ ప్లేయర్ జి. గైబు, వెటరన్ క్రికెటర్ గోవింద్ మోరే, వివిధ రంగాల ప్రముఖులు, ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR