Kadapa: కడప జిల్లాలో 9 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్!
Kadapa: కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం. ప్రత్యేక దాడుల్లో 9 మంది స్మగ్లర్ల అరెస్ట్, టన్ను ఎర్రచందనం దుంగలు స్వాధీనం.
Kadapa: కడప జిల్లాలో 9 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్!
Kadapa: కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ప్రత్యేక బృందాలు విస్తృతంగా దాడులు నిర్వహించి దాదాపు 9 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం....! వీరిని జడ్చర్ల ప్రాంతంలోని ఓ ప్రత్యేక ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
విచారణలో ప్రధాన స్మగ్లర్‌గా జాకీర్ కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అతడి సమీప బంధువు నాగదస్తగిరిరెడ్డి కూడా గతంలో పీడీ యాక్ట్ కింద శిక్ష అనుభవించినట్లు తెలుస్తోంది. అదుపులో ఉన్న వారిలో ఇద్దరిని తప్పించేందుకు నాగదస్తగిరిరెడ్డి ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.
సోమవారం జిల్లా పోలీసు బాస్ స్వయంగా వారిని విచారించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దాదాపు టన్ను ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పూర్తి విచారణ అనంతరం నిందితులను అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.




