Kadapa: ఆర్ఎంపీ క్లినిక్‌లపై మెరుపు దాడులు.. నిబంధనలు మీరితే సీజ్

Kadapa: కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్ షేక్ రోషిణి ఆర్ఎంపీ క్లినిక్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 11 Jun 2026 3:55 PM IST
Kadapa
X

Kadapa: ఆర్ఎంపీ క్లినిక్‌లపై మెరుపు దాడులు.. నిబంధనలు మీరితే సీజ్

Kadapa: కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రథమ చికిత్స కేంద్రాలు, ఆర్ఎంపీ క్లినిక్‌లపై పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్ షేక్ రోషిణి గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా చింతకుంట, గుడిపాడు, చల్లభసాయపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న పలు క్లినిక్‌లను ఆమె నిశితంగా పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు.

​ఈ సందర్భంగా వైద్యాధికారిణి డాక్టర్ షేక్ రోషిణి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రథమ చికిత్స కేంద్రాల నిర్వాహకులు ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని స్పష్టం చేశారు. నిర్వాహకులకు ఆమె పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

క్లినిక్ నామఫలకాలపై కేవలం "ప్రథమ చికిత్స కేంద్రం" అని మాత్రమే ప్రదర్శించాలి. ఆర్ఎంపీలు తమ పేర్ల ముందు 'డాక్టర్' అనే పదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు.

ఆర్ఎంపీలు కేవలం చిన్నపాటి గాయాలు, సాధారణ జ్వరం, దగ్గు, జలుబు వంటి ప్రాథమిక ఆరోగ్య సమస్యలకు మాత్రమే మందులు ఇవ్వాలి. పరిమితికి మించి ఇంజక్షన్లు, సెలైన్లు ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వకూడదు.

ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ హరిచందన, ఎంపీహెచ్ఈఓ సౌభాగ్యలక్ష్మి, హెల్త్ సూపర్వైజర్లు పి. రాజగోపాల్, ఎం. శివ గంగరాజు తదితర ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story