Kadapa: కడపలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు
Kadapa: కడప జిల్లా మైదుకూరు వద్ద కారు ఆర్టీసీ బస్సును ఢీకొంది. ముగ్గురికి తీవ్ర గాయాలు, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
Kadapa
Kadapa: కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మైదుకూరు మండలం శ్రీనగరం సమీపంలో జాతీయ రహదారిపై కారు, ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు డ్రైవర్ నిద్రమత్తులో బస్సును ఓవర్టేక్ చేయబోయి ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే మైదుకూరు ప్రభుత్వాసుపత్రికు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం రిమ్స్ ఆసుపత్రికు మార్చారు.
సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
Next Story




