Kadapa: రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో డీబ్రీఫింగ్ సమావేశం!

Kadapa: కడప కలెక్టరేట్‌లో ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ల సమావేశం. ఎల్ నినో పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయం, పీఎండీఎస్ విధానాలపై విజయ్ కుమార్ కీలక మార్గదర్శకాలు.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 2 Aug 2026 5:20 PM IST
Kadapa
X

Kadapa: రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో డీబ్రీఫింగ్ సమావేశం!

కడప: కడప జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన డీబ్రీఫింగ్ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎస్.వి. ప్రవీణ్ కుమార్ కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లకు డీబ్రీఫింగ్ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శ్రీ విజయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రకృతి వ్యవసాయ విస్తరణ, రైతులకు అందించాల్సిన సాంకేతిక సూచనలు మరియు ఎల్‌నినో పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యవసాయ విధానాలపై పలు కీలక మార్గదర్శకాలను అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు సేవా కేంద్రం (RSK) స్థాయిలో రైతులకు వారి ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు సాగు చేయాలి, వాటిని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఎలా సాగు చేయాలో స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, కొత్తగా ప్రకృతి వ్యవసాయం అమలవుతున్న గ్రామాల్లో బయో రిసోర్స్ సెంటర్ (BRC) యజమానులు గ్రామాలను సందర్శించి ప్రకృతి వ్యవసాయ సూత్రాలు, బయో ఇన్‌పుట్స్ తయారీ, వినియోగం, వాటి ప్రయోజనాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు.

ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల్లో ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ (PMDS) అత్యంత కీలకమైన ప్రకృతి వ్యవసాయ విధానమని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా తక్కువ వర్షపాతం పరిస్థితుల్లో కూడా నేల తేమను సంరక్షించడంతో పాటు పశువులకు నాణ్యమైన పచ్చిమేత లభించి, రైతులకు ఆదాయ భద్రత కలుగుతుందని వివరించారు.

అనంతరం కడప జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ ఎస్.వి. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్‌లో ఫంక్షనల్ గ్రూపుల ప్రాముఖ్యత, పంటల వైవిధ్యం, సీడ్ పెలెటైజేషన్ ప్రక్రియ గురించి ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లకు వివరించారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story