Kadapa: ఈ నెల 22, 23 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు

Kadapa: కడప నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 22, 23 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు. యువత, అర్హులైన పౌరులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో పిలుపు.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 21 Aug 2026 9:30 PM IST
Kadapa
X

Kadapa: ఈ నెల 22, 23 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు

కడప: ఎస్‌ఐఆర్‌-2026లో భాగంగా ఈ నెల 22, 23 తేదీల్లో కడప నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు, ప్రచార శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కడప ఆర్డీవో, నియోజకవర్గ ఎన్నికల అధికారి (ఈఆర్ఓ) మురళి తెలిపారు.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్‌ఓలు అందుబాటులో ఉంటారని, అర్హులైన కొత్త ఓటర్ల నమోదు, ఓటరు జాబితాలో పేర్ల పరిశీలన, సవరణలు, అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ముఖ్యంగా 18–19 ఏళ్ల యువతతో పాటు ముసాయిదా జాబితాలో పేర్లు లేని అర్హులైన పౌరులు ఈ 22, 23 తేదీల ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో మురళి కోరారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story